: సికింద్రాబాద్‌లో ఎస్ఐ స్వాతి ఆత్మహత్య
పుణె నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ మహిళా ఎస్‌ఐ సికింద్రాబాదులో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని తన స్నేహితురాలిని కలిసేందుకు ఈనెల 24న నగరానికి వచ్చిన ఎస్ఐ స్వాతి సికింద్రాబాద్ జవహర్‌నగర్‌లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ గదిలో ఆ ఘటనకు పాల్పడింది. స్వాతి ఉత్తర్‌ప్రదేశ్‌లోని మురాదాబాద్ జిల్లాకు చెందిన మహిళ. ఆమె ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.