: ఆసుపత్రిలో హైడ్రామా.. కలెక్టర్ ఎ.బాబును సెంట్రల్ జైలుకు పంపిస్తానన్న జగన్!
కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై స్పందించిన ఏపీ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రమాద స్థలిని పరిశీలించి ఆరా తీసిన తరువాత నందిగామ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఏపీ ప్రభుత్వం పలువురిని కాపాడేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించిన జగన్... బస్సు ప్రమాదంలో చనిపోయిన డ్రైవర్ పోస్టుమార్టం రిపోర్టును డాక్టర్ వద్ద నుంచి జగన్ లాక్కొని, తిరిగి ఇవ్వలేదు. వైద్యులు బతిమిలాడినా ఆ రిపోర్డును జగన్ ఇవ్వకుండా ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో జోక్యం చేసుకున్న కలెక్టర్ ఎ.బాబు ఆ రిపోర్టును ఇచ్చేయాలని కోరారు. దీంతో కలెక్టర్‌పై జగన్ మండిపడ్డారు. జగన్ చేతిలో ఉన్న రిపోర్టుని కలెక్టర్ ఎ.బాబు తిరిగి తీసుకునే ప్రయత్నం చేయడంతో చెయ్యి తియ్యి అని కసురుకున్నారు. కలెక్టర్‌ను సెంట్రల్ జైలుకు పంపిస్తానని మండిపడ్డారు. పోలీసులు, కలెక్టర్ సహా అందరూ అవినీతిపరులేనని జగన్ ఆరోపించారు. శవపరీక్ష నివేదికను పద్ధతి ప్రకారమే నిర్వహించామని జగన్‌కు కలెక్టర్ చెప్పారు.