: లైంగిక వేధింపులకు గురైన తర్వాత తొలిసారి నోరువిప్పిన నటి భావన!


సినీ నటి భావ‌న‌ కిడ్నాప్‌, లైంగిక వేధింపుల‌కు గురైన ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. అయితే, అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌ని భావన మొద‌టిసారిగా సోష‌ల్ మీడియాలో స్పందించింది. ‘నాకు అండగా నిలిచిన వారందరికీ కృత‌జ్ఞ‌త‌లు. జీవితం కొన్నిసార్లు న‌న్ను కిందకి తోసేసింది, ఆ ఘటనలను నేను గుర్తుచేసుకోదల్చుకోవడం లేదు. నేను జీవితంలో విషాదాన్ని, అపజయాలను చూశాను. అయితే, ఒక్క విషయాన్ని మాత్రం కచ్చితంగా చెప్పగలను. నేను ఎన్నిసార్లు కింద పడినా తిరిగి లేస్తాను’ అని ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పేర్కొంది. తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్న‌ట్లు చెప్పింది.

భావన కేసులో వేగంగా విచారణ జరిపిన పోలీసులు నిందితులని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. భావనపై జరిగిన దారుణాన్ని ఖండిస్తూ ఎంతో మంది సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులకి కఠిన శిక్ష వేసి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలని డిమాండ్  చేశారు.

  • Loading...

More Telugu News