: జారిపోతున్న సబ్బుని అందుకోబోయి విద్యార్థిని మృతి


ఓ విద్యార్థిని కళాశాల హాస్టల్‌లోని మూడో అంతస్తు నుంచి కిందపడిపోయి ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న గుంటూరు రూరల్‌ మండలం బుడంపాడులోని సెయింట్‌ మేరీస్‌ కళాశాలలో ఈ రోజు ఉద‌యం చోటు చేసుకుంది. అదే జిల్లాలోని అమృతలూరుకు చెందిన శ్రావణ సంధ్య అనే విద్యార్థిని స్నానం చేసే ముందు సబ్బు పెట్టె చేతిలో నుంచి జారిపోగా దానిని అందుకునే క్రమంలో ఆమె అదుపుతప్పి పై నుంచి కింద‌ పడిపోయింద‌ని స‌ద‌రు కాలేజీ సిబ్బంది తెలిపారు. అనంత‌రం తాము ఆసుప‌త్రికి త‌ర‌లించామ‌ని, అయితే అప్ప‌టికే ఆమె ప్రాణాలు కోల్పోయింద‌ని వైద్యులు త‌మ‌కు తెలిపిన‌ట్లు పేర్కొన్నారు. అయితే, స‌ద‌రు విద్యార్థిని మృతిపై ఆమె బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News