: 99 ఏళ్ల బామ్మ‌గారి కోరిక తీరింది.. 'శీకృష్ణ జన్మ స్థానాన్ని' ఆస్వాదించింది!


జీవిత‌పు చివ‌రి కాలంలో కృష్ణా, రామా అనుకుంటూ ఇంట్లోనే కూర్చునే వారిని చూశాం. తీర్థ‌యాత్ర‌ల‌కు బ‌య‌లుదేరి దేవుళ్లంద‌రినీ ద‌ర్శించుకునే వారి గురించి వింటూనే ఉంటాం. అయితే, నెదర్లాండ్‌కు చందిన ఓ 99 ఏళ్ల బామ్మ‌కి మాత్రం విచిత్రమైన కోరిక ఉంది. ఒక్క‌రోజైనా జైల్లో గ‌డ‌పాల‌న్నది ఆమె చిరకాల వాంఛ! ఇన్నాళ్లు ఆ కోరికను త‌న‌లోనే దాచుకుంటూ వ‌స్తోన్న ఆ బామ్మగారి కోరిక తాజాగా నెర‌వేరింది.

ఆవిడగారి కోరిక‌ను గురించి తెలుసుకున్న ఆమె మేన‌కోడ‌లు పోలీసు అధికారుల‌తో మాట్లాడి వారిని ఒప్పించింది. ఆ బామ్మ కోరిక‌ను గురించి తెలుసుకున్న అక్క‌డి పోలీసులు అందుకు ఒప్పుకుని ఇంటికెళ్లి ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం బామ్మ‌ను జైలుకు త‌ర‌లించి సెల్లో వేశారు. జైల్లో కూర్చొన్న బామ్మ ఎంత‌గానో సంబ‌ర‌పడిపోయింది. జైలు సెల్లో న‌వ్వుతూ ఫొటోలు దిగింది.

  • Loading...

More Telugu News