: ఉతకనక్కర్లేదు గానీ.. ఎంతకాలం వేసుకుంటాం...


ఉతికే అవసరం లేదు కదాని ఒకే చొక్కా వందరోజుల పాటూ వేసుకు తిరగడం సాధ్యమేనా? అలా వేసుకుని తిరుగుతూ ఉంటే మన జీవితం మీద మనకే విరక్తి పుట్టకుండా ఉంటుందా? ఈ అనుమానాల సంగతి తరవాత.. ముందైతే అమెరికాకు చెందిన వూల్‌ అండ్‌ ప్రిన్స్‌ కంపెనీ రూపొందించిన చొక్కా గురించి తెలుసుకోవాలి.

సదరు కంపెనీ వారు ఓ కొత్త రకం గుడ్డతో చొక్కాను తయారుచేశారు. దీనిని వందరోజులు ఉతకకుండా.. కంటిన్యుయస్‌గా వేసుకున్నా సరే.. ఎలాంటి దుర్వాసన వెలువరించకుండా.. చాలా మామూలుగానే ఉంటుందిట. ప్రత్యేకమైన మెటీరియల్‌తో చేసిన ఈ చొక్కాకు మురికి, దుమ్ము, దుర్వాసన అంటదట.. అయితే ఈ చొక్కా ధర మాత్రం.. 5000 రూపాయలు.

అంతసొమ్ము పోసి చొక్కా గలిగిన రేంజి వాళ్లు.. ఉతుక్కోవడానికి గతిలేని వాళ్లలాగా.. ఏకబిగిన ఒకే చొక్కాను వేసుకుంటూ జీవితం వెళ్లబుచ్చేస్తారా అని సందేహం వస్తుంది మనకు. అయితే.. ఆ సత్యం సదరు వూల్‌ అండ్‌ ప్రిన్స్‌ కంపెనీ వారికి అర్థం కావడానికి మరి కొన్నాళ్లు పడుతుందేమో.

  • Loading...

More Telugu News