: సర్కార్-3 పాత్రలను వినూత్న రీతిలో పరిచయం చేసిన వర్మ


బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తీస్తోన్న సర్కార్-3 సినిమా ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైల‌ర్ రేపే విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా స‌ర్కార్‌-3 ఫస్ట్‌ లుక్‌ని వర్మ ఎరోస్ నౌ అధికారిక ట్విట్టర్ ద్వారా వినూత్న రీతిలో విడుదల చేశాడు. ట్విట్ట‌ర్ పోస్టుల‌ ద్వారానే సినిమాలోని పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేశాడు. గోవింద్ దేశ్ పాండే పాత్రలో మనోజ్ బాజ్ పాయ్, అన్ను కర్కారే పాత్రలో యామి గౌతమ్, శివాజీ నగ్రే పాత్రలో అమిత్ సౌద్, మైకెల్ వల్యా పాత్రలో జాకీష్రాఫ్ లు ఈ సినిమాలో క‌న‌ప‌డ‌నున్నార‌ని వ‌ర్మ త‌న పోస్టుల ద్వారా తెలిపాడు.






  • Loading...

More Telugu News