: అంబటి రాంబాబు 'లా' డిగ్రీని రద్దు చేయండి: టీడీపీ నేత చందు సాంబశివరావు
వైసీపీ నేతలు అంబటి రాంబాబు, రోజాలపై టీడీపీ నేత చందు సాంబశివరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వీరిద్దరూ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. లోకేష్ పై వీరు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. లోకేష్ ఉన్నత విద్య చదివారని... సమర్థత కలిగిన యువ నేత అని కొనియాడారు. ఆయన సమర్థతను చూసే, ప్రభుత్వంలోకి తీసుకుంటున్నారని చెప్పారు. రాజ్యంగంపై ఏమాత్రం అవగాహన లేకుండా అంబటి రాంబాబు మాట్లాడుతున్నారని... ఆయనకు ఉన్న లా డిగ్రీని ప్రభుత్వం రద్దు చేయాలన్నారు. ప్రతి ఒక్కరు జగన్ లాగ అవినీతిపరులుగా ఉంటారనే భ్రమల్లో నుంచి రోజా బయటకు రావాలని సూచించారు.