: ఆటోను ఢీకొన్న‌ ర‌జనీ కుమార్తె కారు.. హీరో ధనుష్‌ జోక్యంతో పోలీసుల‌కి ఫిర్యాదు చేయ‌ని డ్రైవ‌ర్‌


సినీనటుడు రజనీకాంత్ కుమార్తె, దర్శకురాలు సౌందర్య ప్రయాణిస్తున్న కారు ఓ ఆటో రిక్షాను ఢీకొట్టింది. ఈ రోజు ఉద‌యం చెన్నైలోని ఆళ్వార్‌పేట్ ప్రాంతంలో ఆమె కారులో వెళుతున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఆటో డ్రైవ‌ర్‌కి గాయాలు కాగా సౌందర్యకి మాత్రం ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాద వార్త తెలియగానే సౌంద‌ర్య బావ, సినీన‌టుడు ధ‌నుష్ అక్క‌డ‌కు చేరుకున్నాడు. పోలీసుల‌కి ఫిర్యాదు చేయ‌డానికి వెళుతున్న ఆటో డ్రైవర్‌కి న‌చ్చ‌జెప్పి అత‌డి వైద్యానికయ్యే ఖర్చులు భరిస్తామని, పరిహారం ఇస్తామని చెప్పాడు. దీంతో ఆటో డ్రైవర్ అందుకు అంగీక‌రించాడు. ఈ స‌మ‌యంలో సౌందర్య కారును స్వయంగా నడిపారా? లేక డ్రైవర్ ఉన్నాడా? అన్న విషయం గురించి స‌మాచారం అంద‌లేదు.

  • Loading...

More Telugu News