: ఏడేళ్ల తర్వాత వెండితెరపై కలిసి నటిస్తున్న ఐశ్వర్య, అభిషేక్
పదేళ్ల క్రితం (2007లో) పెళ్లి చేసుకున్న బాలీవుడ్ తారలు ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ ల జంట ఆ తరువాత మూడేళ్లకు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘రావణ్’ చిత్రంలో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు అంటే ఏడేళ్లుగా వీరిద్దరి కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే, ప్రస్తుతం ఐష్ మరోసారి అభిషేక్‌తో కలసి నటిస్తుందట. బాలీవుడ్‌లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రానున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'గులాబ్ జామున్' అనే సినిమాలో వీరిద్దరినీ చూడవచ్చట. ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.