: గుర్ మెహర్ కౌర్ కు భారీ స్థాయిలో కౌంటర్ ఇచ్చిన రెజ్లర్ యోగేశ్వర్ దత్!


ఢిల్లీ యూనివర్శిటీలో విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఏబీవీపీపై సోషల్ మీడియాలో పోస్టర్ వార్ కు తెరతీసింది విద్యార్థిని గుర్ మెహర్ కౌర్. 'మా నాన్న ను పాకిస్థాన్ చంపలేదు... యుద్ధం చంపింది' అంటూ ఆమె అప్ లోడ్ చేసిన ఫొటో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో, ఆమెపై పలువురు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇప్పటికే క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ ఆమెకు కౌంటర్ ఇచ్చాడు.

ఇప్పడు తాగాజా ఆ జాబితాలో ఒలింపియన్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ కూడా చేరాడు. ఆమె ఫొటోతో పాటు హిట్లర్, ఒసామా బిన్ లాడెన్, కృష్ణ జింకల ఫొటోలను పెట్టాడు. 'యూదులను నేను చంపలేదు... గ్యాస్ చంపింది' అంటూ హిట్లర్ ఫొటోపై క్యాప్షన్ పెట్టాడు. 1939లో గ్యాస్ ఛాంబర్ లో పెట్టి 90 వేల మందిని హతమార్చిన సంగతి తెలిసిందే. అలాగే 'నేను ప్రజలను చంపలేదు... బాంబులు చంపాయి' అని లాడెన్ అన్నట్టు, 'నన్ను భాయ్ (సల్మాన్ ఖాన్) చంపలేదు... బుల్లెట్లు చంపాయి' అంటూ కృష్ణ జింక అన్నట్టు వ్యంగ్యంగా ఉన్న ఫొటోను యోగేశ్వర్ అప్ లోడ్ చేశాడు.

  • Loading...

More Telugu News