: త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న ఎయిరిండియా విమానం
ల్యాండింగ్ గేర్ పిన్‌లను తీయకుండానే ఎయిర్ ఇండియా విమానం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని ఇద్దరు ఇంజనీర్లు క్లియరెన్సు ఇవ్వడంతో విమానం అలాగే టేకాఫ్ అయిన ఘటన ఢిల్లీ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. దీంతో ఆ ఎయిర్‌పోర్టు నుంచి కేరళలోని కొచ్చి వెళ్లాల్సిన సదరు విమానం ప్రమాదంలో పడింది. గాల్లోకి వెళ్లిన తర్వాత విమాన చక్రాలు లోపలకు వెళ్లలేదు. విషయాన్ని గుర్తించిన పైలట్ టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటికే దాన్ని మళ్లీ అదే విమానాశ్రయంలో దించేశారు. ఈ విషయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఇంజనీర్లను విధుల నుంచి తప్పించారు.