: బస్సు ప్రమాదంపై స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి
తమ కుటుంబం నిర్వహిస్తున్న ట్రావెల్స్ సంస్థకు చెందిన బస్సు ఘోర ప్రమాదానికి గురి కావడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ఈ ఘటన తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని, ఇది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. గాయపడిన వారిని ఆదుకుంటామని, వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించేలా చూడాలని ఇప్పటికే స్థానిక ప్రజా ప్రతినిధులను కోరామని తెలిపారు. తమ బస్సులు ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడంలో ముందుంటాయని ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.