: 'ఏరా' అని పిలవడం రవితేజకు నచ్చలేదేమో!: రాజా రవీంద్ర
చాలా మంది అనుకుంటున్నట్టు హీరో రవితేజకు, తనకు మధ్య ఎలాంటి ఆర్థిక విభేదాలు లేవని క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజా రవీంద్ర తెలిపాడు. రవితేజతో తనకు చాలా సాన్నిహిత్యం ఉండేదని... అతని కాళ్లు కడిగి తానే పెళ్లి చేశానని చెప్పాడు. ఆ తర్వాత మేనేజర్ గా అతని డేట్స్ కూడా తానే చూశానని తెలిపాడు. అయితే, ఒకప్పుడు రవితేజను తాను 'ఏరా' అని పిలిచేవాడినని... పెద్ద హీరో అయిన తర్వాత ఆ పిలుపు అతనికి నచ్చి ఉండకపోవచ్చని... అందుకే తనను దూరం పెట్టి ఉండవచ్చని చెప్పాడు. తన వ్యవహారాలను తానే చూసుకోగలనని చెప్పి... తనను రవితేజ దూరం పెట్టాడని తెలిపాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజా రవీంద్ర మాట్లాడుతూ, ఈ విషయాన్ని వెల్లడించాడు. ప్రస్తుతం జయసుధ, రాజ్ తరుణ్, విష్ణు, నిఖిల్, సునీల్ ల డేట్స్ చూసుకుంటున్నానని తెలిపాడు.