: సెహ్వాగ్ జోకేశాడు, నేను నవ్వాను... నన్ను నిందించొద్దు: బాలీవుడ్ హీరో


ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని గుర్ మెహర్ కౌర్, తన తండ్రి మరణంపై చేసిన ట్వీట్ పై, సెహ్వాగ్ వ్యంగ్యంగా స్పందించిన నేపథ్యంలో, సెహ్వాగ్ ట్వీట్ ను సమర్థించిన బాలీవుడ్ హీరో, 'హైవే' ఫేమ్ రణదీప్ హుడాపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో, వివరణ ఇచ్చాడు. సెహ్వాగ్ ఓ జోకు వేస్తే, తాను నవ్వానని, అందుకని తనను నిందించడం సరికాదని వాపోయాడు. కేవలం నవ్వినందుకే తనను సామాజిక మాధ్యమాల్లో ఉరితీసినంత పని చేస్తున్నారని చెప్పాడు.

ఓ యువతిని బెదిరించడం సబబని తాను ఎన్నడూ చెప్పలేదని, చెప్పబోనని, ఆమెకు వస్తున్న ట్వీట్లలో సైతం బెదిరింపు ట్వీట్లు అతి తక్కువగానే ఉండవచ్చని చెప్పాడు. తాను తప్పనుకున్న విషయమై నిరసన తెలిపే హక్కు గుర్ మెహర్ కు ఉందని రణదీప్ హుడా వ్యాఖ్యానించాడు. తన ట్వీట్ ను గుర్ మెహర్ కు ట్యాగ్ చేయలేదన్న విషయాన్ని మీడియా విస్మరించిందని చెప్పాడు.

  • Loading...

More Telugu News