: అన్నదమ్ములు ఇద్దరికీ ఇవాళ పెళ్లిచూపులు.. ఇంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు!


కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు వద్ద దివాకర్ ట్రావెల్స్ బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు అన్నదమ్ముల నేపథ్యం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డిలు సూర్యాపేట జిల్లాకు చెందినవారు. కృష్ణా రెడ్డి బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. శేఖర్ రెడ్డి ఒడిశాలో సీఆర్పీఎఫ్ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. మూడు రోజులు సెలవులు రావడంతో... కృష్ణారెడ్డి ఒడిశాకు వెళ్లాడు. కటక్ నుంచి వీరిద్దరూ తమ స్వస్థలానికి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరికీ గరిడేపల్లి మండలం కోదండరామపురంలో ఇవాళ పెళ్లిచూపులు ఉన్నాయి. పెళ్లి పీటలు ఎక్కుతారనుకున్న అన్నదమ్ములు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

  • Loading...

More Telugu News