: పవన్ అభిమానులకు నేను అలా చెప్పలేను: సాయి ధరమ్ తేజ్
మెగా హీరోల ఫంక్షన్ ఏదైనా సరే... అక్కడ 'పవర్ స్టార్ పవన్ కల్యాణ్' అంటూ నినాదాలు మారుమోగడం సర్వసాధారణమైన విషయం. పవన్ అభిమానుల నినాదాలు చాలా సార్లు మెగా హీరోలను ఇబ్బంది పెడుతుంటాయి. అయినా, నవ్వులు చిందిస్తూ అలా ఉండిపోతుంటారు. ఒకసారి మాత్రం అల్లు అర్జున్ కంట్రోల్ చేసుకోవడం తన వల్ల కాక 'చెప్పను బ్రదర్' అన్నాడు. దీంతో, పవన్ అభిమానులందరికీ బన్నీ యాంటీ అయిపోయాడు. నాగబాబు కూడా ఓ సందర్భంలో పవన్ కల్యాణ్ అభిమానులకు క్లాస్ తీసుకున్నాడు.
ఈ నేపథ్యంలో, సాయి ధరమ్ తేజ్ ఓ సందర్భంలో మాట్లాడుతూ, పవన్ అభిమానులను 'నేను ఆపలేను' బ్రదర్ అన్నాడు. మామయ్య పేరుతో నినాదాలు చేస్తున్న వారిని తాను ఎలా ఆపగలను? అని చెప్పాడు. నాగబాబు, బన్నీలు పవన్ అభిమానులకు క్లాస్ తీసుకున్నారుగా? అని ప్రశ్నిస్తే... అది వారి సొంత విషయమణి, వాళ్ల సిట్యువేషన్ లోకి తాను వెళ్లి కామెంట్ చేయలేనని చెప్పాడు. ముగ్గురు మామయ్యలంటే తనకు చాలా ఇష్టమని... వారి వల్లే అమ్మ, తాను, తమ్ముడు ఈరోజు ఇలా ఉన్నామని తెలిపాడు. సాయి ధరమ్ వ్యాఖ్యలు పవన్ అభిమానులకు ఆనందం కలిగించేవే.