: అమెరికాలో ఇళ్లపై కూలిన చార్టెడ్ విమానం... నలుగురి మృతి
అమెరికాలో చార్టర్డ్ విమానం ఒకటి జనావాసాలపై కుప్పకూలింది. కాలిఫోర్నియాలో ఈ ఘటన జరిగింది. అదుపు తప్పి దూసుకొచ్చిన విమానం భవనంపై కూలిన తరువాత ఇంధన ట్యాంకు పేలిపోగా, విమానంలోని నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ ప్రమాదంలో భవంతి పూర్తిగా అగ్నికీలల్లో చిక్కుకుంది. ప్రమాదం గురించి తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. విమానం ఎందుకు కూలిందన్న విషయమై విచారణ ప్రారంభించినట్టు ఏవియేషన్ వర్గాలు తెలిపాయి.