: జాతీయ పార్కుల వద్దకు రాకుండా 'బీబీసీ'పై నిషేధం విధించిన మోదీ సర్కారు


అసోం కజిరంగా పార్కులో భారత ప్రభుత్వం చేపట్టిన జంతు రక్షణ చర్యలను ప్రశ్నిస్తూ, ప్రముఖ న్యూస్ నెట్ వర్క్ బీబీసీ తీసిన డాక్యుమెంటరీ అత్యంత దారుణంగా, వాస్తవ రహితంగా ఉందని ఆరోపిస్తూ, ఇండియాలోని ఏ జాతీయ పార్కు వద్దకు కూడా బీబీసీ, దాని జర్నలిస్టు జస్టిన్ రౌలత్ రాకుండా ఐదేళ్ల పాటు నిషేధాన్ని విధిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. 'వన్ వరల్డ్: కిల్లింగ్ ఫర్ కన్జర్వేషన్' అనే టైటిల్ తో బీబీసీకి చెందిన దక్షిణాసియా ప్రతినిధి జస్టిన్ రౌలత్ ఈ డాక్యుమెంటరీ తీశారు.

కజిరంగా నేషనల్ పార్కులో ఖడ్గమృగాల పరిరక్షణ చర్యలు ఎంతమాత్రమూ బాగాలేవని విమర్శించారు. ఫారెస్టు గార్డులకు ఆటవిక అధికారాలు ఇచ్చారని తప్పుబట్టాడు. ఈ డాక్యుమెంటరీ శుద్ధ తప్పని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇటువంటి వీడియోలు ప్రసారం చేసే ముందు తప్పనిసరిగా, ఎంఓఈఎఫ్సీసీ, విదేశాంగ శాఖ అనుమతులు తీసుకోవాలని, బీబీసీ అలా చేయలేదని ఆక్షేపించింది. టైగర్ రిజర్వు ఫారెస్టులు, టైగర్ రేంజీలు ఉన్న అన్ని రాష్ట్రాలకూ నిషేధం వర్తమానాన్ని పంపినట్టు పేర్కొంది.

  • Loading...

More Telugu News