: దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో ఎనిమిదికి పెరిగిన మృతుల సంఖ్య


విశాఖ నుంచి హైదరాబాద్ వెళుతున్న దివాకర్ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు పెనుగంచి ప్రోలు మండలం, ముళ్లపాడు అడ్డరోడ్డు వద్ద ఘోర ప్రమాదానికి గురైన సంగతి విదితమే. జాతీయ రహదారి వంతెనపై డివైడరును ఢీకొని, రెండు వంతెనల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో బస్సు ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జుకాగా, అక్కడికక్కడే ఏడుగురు మరణించారు. మరో వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ప్రమాదంలో 30 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు కల్వర్టు మధ్యలో ఇరుక్కుని ఉండటంతో సహాయక చర్యలు ఆలస్యంగా సాగుతున్నాయి.

  • Loading...

More Telugu News