: ట్రంప్ మాట్లాడాల్సిందే: సునయన వీడియో పెట్టి ఘాటుగా స్పందించిన హిల్లరీ క్లింటన్


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చేతిలో తృటిలో ఓటమి చవిచూసిన హిల్లరీ క్లింటన్, కూచిభొట్ల శ్రీనివాస్ హత్యపై ఘాటుగా స్పందించారు. ఆయన భార్య సునయన, ట్రంప్ ఏం చెబుతారని ప్రశ్నిస్తున్న వీడియోను జత చేస్తూ, తన ట్విట్టర్ ఖాతాలో ఆమె మండిపడ్డారు. అమెరికాలో బెదిరింపులు, జాతి విద్వేష నేరాలు పెరిగాయని, వీటిపై ట్రంప్ మాట్లాడాల్సిందేనని డిమాండ్ చేశారు. అధ్యక్షుడు తాను చేయాల్సిన పనిని తాను చేయాలని, ఇతరులతో చెప్పించుకునే స్థితిలో ఉండరాదని అన్నారు. కాగా, శ్రీనివాస్ హత్య తరువాత జాతి విద్వేష నేరాలపై అమెరికాలో గతంలో ఎన్నడూ లేనంతటి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అమెరికాలో ఇండియన్స్ భద్రతపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇటీవలి ట్రంప్ ఇమిగ్రేషన్ ఉత్తర్వులను కోర్టులు అడ్డుకోవడంతో, వాటికి స్వల్ప మార్పులను చేస్తూ, మరో కొత్త చట్టాన్ని తెస్తానని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News