: ప్రయాణికులకు శుభవార్త.. పట్టాలెక్కిన అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రైలు
రైలు ప్రయాణికులకు ఇది నిజంగా శుభవార్తే. ఎర్నాకుళం-హౌరా మధ్య అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమైంది. సోమవారం రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైలును ప్రారంభించారు. రైలు మొత్తం జనరల్ బోగీలే ఉండడం అంత్యోదయ రైలు ప్రత్యేకత. ఒక కోచ్ నుంచి మరో కోచ్‌కు వెళ్లే సౌకర్యంతోపాటు ప్రతి కోచ్‌లోనూ మొబైల్ చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. వీక్లీ రైలు అయిన ఈ రైలు (22877) ప్రతి శనివారం సాయంత్రం 5 గంటలకు హౌరాలో బయలుదేరి సోమవారం ఉదయం 6 గంటలకు ఎర్నాకుళం చేరుకుంటుంది.
అలాగే 22878 నంబరు రైలు ప్రతి సోమవారం అర్ధరాత్రి దాటాక 00.25 (మంగళవారం ఉదయం) గంటలకు ఎర్నాకుళంలో బయలుదేరి బుధవారం మధ్యాహ్నం 2.50 గంటలకు హౌరా చేరుకుంటుంది. ఖరగ్‌పూర్, కటక్, భువనేశ్వర్, పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, దువ్వాడ, జోలార్‌పెట్టాయ్, కోయంబత్తూరు, పాలక్కడ్, త్రిసూర్ మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది.