: పేటీఎం నుంచి మరో కొత్త యాప్.. ప్రకటించిన సంస్థ


ఈ-కామర్స్ ప్రముఖ సంస్థ పేటీఎం నుంచి మరో కొత్త యాప్ వచ్చేసింది. ‘పేటీఎం మాల్’ పేరుతో విడుదల చేయనున్న ఈ యాప్‌లో భారతీయ వినియోగదారుల కోసం మాల్, బజార్ సేవలను అందించనున్నట్టు తెలిపింది. ఇందులోకి బాగా నమ్మకస్తులైన విక్రయదారులను, మంచి నాణ్యత కలిగిన వస్తువులనే అనుమతిస్తామని పేటీఎం పేర్కొంది. షిప్పింగ్ సేవలు కూడా నాణ్యంగా ఉంటాయని తెలిపింది. దేశవ్యాప్తంగా మొత్తం 17 పేటీఎం మాల్ సెంటర్లు ఉన్నట్టు సంస్థ ఉపాధ్యక్షుడు సౌరభ్ వశిష్ఠ తెలిపారు. త్వరలోనే పేటీఎం మాల్ ఐఓఎస్‌ను కూడా విడుదల చేయనున్నట్టు సౌరభ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News