: ఎన్నికల్లో పోటీ చెయ్.. నేను ప్రచారం చేస్తా!: నారా లోకేశ్‌కు కేఏ పాల్ బంపరాఫర్!


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు డాక్టర్ కేఏపాల్ బంపరాఫర్ ఇచ్చారు. ఎమ్మెల్సీగా ప్రభుత్వంలోకి అడుగుపెడుతున్న ఆయనను ఉద్దేశించి పాల్ ఓ ట్వీట్ చేశారు. ఎన్నికలలో పోటీ చేసి, ఎమ్మెల్యేగా రావాలని అందులో సూచించారు. లోకేశ్ తరపున తాను ప్రచారం చేస్తానంటూ ఆఫర్ కూడా ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రచారం చేసినట్టుగానే లోకేశ్‌కు కూడా చేస్తానని, వెనక్కు తగ్గద్దని ట్వీట్‌లో పేర్కొన్నారు.






 

  • Loading...

More Telugu News