: కాటమరాయుడి సెట్ లో పవన్ కల్యాణ్ తో సెల్ఫీలు దిగిన బండ్ల గణేష్
సినీనటుడు పవన్ కల్యాణ్‌ని నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఎంతగా అభిమానిస్తాడో అందరికీ తెలిసిందే. పలు వేదికలపై పవన్ కల్యాణ్‌ని ఆయన దేవుడితోనూ పోల్చారు. ప్రస్తుతం పవన్ కాటమరాయుడు షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ఆ సినిమా సెట్‌కి వెళ్లిన బండ్ల గణేష్ పవన్ కల్యాణ్‌తో ఫొటోలు దిగాడు. ఈ సందర్భంగా పవన్ కల్యాణే స్వయంగా సెల్ఫీ తీశాడు. దీంతో గణేశ్ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. బాస్‌తో ఫొటో దిగానని పేర్కొన్నాడు. ఇక పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఈ పోస్టుకి ‘దేవుడితో భక్తుడు సెల్ఫీ’ అని పేరుపెట్టేశారు.
దేవుడితో భక్తుడు సెల్ఫీ @ganeshbandla @nseplofficial #PawanKalyan #PSPK pic.twitter.com/M8M6egdbTq
— Brahma Kadali (@brahmakadali) February 27, 2017