: బెంగళూరు టెస్టులోనూ అద్భుత ప్రదర్శన కనబరుస్తాం: ఆస్ట్రేలియా కోచ్


పూణేలో జ‌రిగిన మొద‌టి టెస్టు మ్యాచులో టీమిండియాను ఆస్ట్రేలియా చిత్తుగా ఓడించిన విష‌యం తెలిసిందే. ఆ ఆట‌ తీరునే బెంగళూరు వేదిక‌గా జ‌రిగే రెండో టెస్టులోనూ త‌మ క్రికెటర్లు ప్రదర్శించాలని తాను కోరుకుంటున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు కోచ్‌ డారెన్‌ లేమాన్‌ అన్నారు. మొద‌టి టెస్టు మ్యాచులో 12 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా బౌల‌ర్‌ ఒకీఫెను ఆయ‌న అభినందించారు. టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను ఒకీఫె అద్భుతంగా కట్టడి చేశాడని అన్నారు. మొద‌టి టెస్టులో కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్ కూడా అద్భుత ప్రదర్శన చేశాడ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇదే ఆట‌తీరును రెండో టెస్టులోనూ కనబరిస్తే విజయం సొంత‌మ‌వుతుంద‌ని అన్నారు.

  • Loading...

More Telugu News