: కశ్మీర్‌ స్వాతంత్ర్యం అంటూ ప్రదర్శనలు చేయడంలో అర్థంలేదు: విద్యార్థుల ర్యాలీపై వెంకయ్య


ప్రశాంత వాతావ‌ర‌ణంలో విద్యన‌భ్య‌సించాల్సిన విద్యార్థులు ర్యాలీలు, ఆందోళ‌న‌ల్లో పాల్గొంటూ వార్త‌ల్లోకెక్కుతున్నారు. ఢిల్లీ యూనివ‌ర్సిటీ ప‌రిధిలోని రాంజాస్ కాలేజ్‌లో ఏబీవీపీ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల మధ్య వివాదం చోటుచేసుకున్న నేప‌థ్యంలో అక్కడ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడు స్పందించారు. ఈ రోజు ఆయ‌న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో వర్సిటీల్లో ఉద్రిక్తతలు సృష్టించడం సరికాదని అన్నారు. స్వేచ్ఛ‌కు కూడా కొన్ని పరిమితులు ఉంటాయని అన్నారు.

అన్యమతస్థుల మనోభావాలను కించపరచకూడద‌ని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. దేశ సమైక్యతను ప్రశ్నించే హక్కు ఎవరికీలేదని, కశ్మీర్‌ స్వాతంత్ర్యం అంటూ ప్రదర్శనలు చేయడంలో అర్థం లేదని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విశ్వవిద్యాల‌య క్యాంప‌స్‌లు వేర్పాటువాదానికి ప్రయోగశాల కాకూడ‌ద‌ని హిత‌వు ప‌లికారు. కొన్ని రాజకీయ పార్టీలు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయ‌న ఆరోపించారు.

  • Loading...

More Telugu News