: ప్రపంచంలోనే తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల


‘గిగాబిట్‌’ పేరుతో ప్రపంచంలోనే తొలిసారి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఈ రోజు స్పెయిన్‌ రాజధాని బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో ఆవిష్కరించారు. ప్రముఖ చైనా కంపెనీ జెడ్‌టీఈ త‌యారు చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో సెకనుకు 1జీబీ వేగంతో డేటాను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇప్పుడు అంద‌రికీ అందుబాటులోకి వ‌చ్చిన‌ 4జీ సేవ‌ల‌తో స్మార్ట్‌ఫోన్‌ల‌లో ఇంటర్నెట్ వేగం ఎన్నో రెట్లు పెరిగిన విష‌యం తెలిసిందే.

అయితే, ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ 4జీ కన్నా 10రెట్లు వేగంగా పనిచేస్తుంది. ఈ సంద‌ర్భంగా జెడ్ఈటీ ప్రతినిధులు మాట్లాడుతూ వాణిజ్య పరంగా ఈ సాంకేతికత 2020లోగా అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఈ ఫోన్‌లో సెకన్లలోనే పూర్తి నిడివి గల సినిమాలను డౌన్‌లోడ్‌ చేసుకోవ‌చ్చని వారు పేర్కొన్నారు. అంతేగాక ఇందులో ఎన్నో కొత్త సౌక‌ర్యాలు ఉంటాయ‌ని తెలిపారు. కాగా, దక్షిణకొరియా సంస్థ కేటీ కార్ప్‌ 2018 వింటర్‌ ఒలింపిక్స్‌లో 5జీ సేవలను ప్రయోగాత్మకంగా అందించాల‌ని లక్ష్యంగా పెట్టుకుని కృషి చేస్తోంది.

  • Loading...

More Telugu News