: దుబాయ్‌లో ‘పాకిస్థాన్ సూపర్ లీగ్’ చూస్తూ ఎంజాయ్ చేస్తోన్న సానియా మీర్జా
భారత టెన్నిస్ స్టార్, హైదరాబాదీ సానియా మీర్జా దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం దుబాయ్‌లో ‘పాకిస్థాన్ సూపర్ లీగ్’ క్రికెట్ జరుగుతోంది. ఆ లీగ్‌లో తన భర్త, క్రికెటర్ షోయబ్ మాలిక్ ఆడుతున్న మ్యాచ్‌లను ఆమె ఆసక్తిగా చూస్తూ ఆయనను ప్రోత్సహిస్తోంది. స్టాండ్స్‌లో కూర్చుని తన భర్త ఆటను గమనిస్తోంది. ఈ సందర్భంగా సానియా మీర్జా మాట్లాడుతూ.. తన భర్త ఆటను చూసేందుకు అక్కడికి వచ్చినట్లు చెప్పింది. తనకు గతంలో క్రికెట్‌పై అంత ఆసక్తి ఉండేది కాదని, షోయబ్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత క్రికెట్‌ని కూడా ఆస్వాదించడం మొదలుపెట్టానని చెప్పింది.