: అఖిల్-శ్రియా భూపాల్ పెళ్లి రద్దుపై ప్రశ్నించడానికి ప్రయత్నించిన మీడియా.. అవకాశం ఇవ్వని అమల!


సినీన‌టుడు అక్కినేని నాగార్జున చిన్న‌ కుమారుడు అఖిల్‌కి, ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే రెడ్డి మనవరాలు శ్రియా భూపాల్‌కి ఇటలీలోని రోమ్ లో పెళ్లి చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్న నేపథ్యంలో వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చిన విషయం తెలిసిందే. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అఖిల్, శ్రియల మధ్య విభేదాలు తలెత్తాయని, వారిద్దరూ బహిరంగంగానే వాదనకు దిగారని ఎన్నో వార్త‌లు వ‌చ్చాయి. దీంతో వారిద్ద‌రి పెళ్లి ర‌ద్దు అయిన‌ట్లేన‌ని అంద‌రూ భావిస్తున్నారు. అయితే, ఈ విష‌యంపై స్పందించ‌డానికి అక్కినేని కుటుంబంలోని ఏ ఒక్క‌రూ ఆస‌క్తి చూప‌డం లేదు.  

ఈ క్రమంలో అక్కినేని అఖిల్ తల్లి అమల హైదరాబాద్ నగరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమెను మాట్లాడించేందుకు మీడియా ప్ర‌య‌త్నాలు చేసి విఫ‌ల‌మైంది. ఇన్ ఆర్బిట్ మాల్ లో ఓ ఆర్ట్ గ్యాలరీ తో పాటు మాదాపూర్ లో ఓ సెలూన్, స్పాను అమ‌ల‌ ప్రారంభించారు. మీడియా నుంచి తనయుడి పెళ్లి ప్రస్తావన ప్ర‌శ్న వ‌స్తుంద‌ని ముందుగానే ఊహించిన అమ‌ల మీడియాకు ఆ అవకాశం కూడా ఇవ్వకుండా దూరం పెట్టారు.

  • Loading...

More Telugu News