: రేపటి నుంచి నెల రోజుల పాటు ఏపీ సీఎస్‌గా అజేయ కల్లం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్‌పీ టక్కర్ రేపు పదవీ విరమణ చేయబోతున్న నేపథ్యంలో ఆ స్థానంలో ఎవరు నియమితులవుతారన్న సందిగ్ధతకు తెరపడింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అజేయ కల్లం పేరును రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. అజేయ కల్లం ప్రస్తుతం ఆర్ధిక, రెవెన్యూ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఆయన మార్చి నెలాఖరులోనే పదవీ విరమణ చేయాల్సి ఉంది. దీంతో ఆయన ఒక నెల మాత్రమే సీఎస్ పదవిలో ఉంటారు. ఆయన తరువాత సీఎస్‌గా దినేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు.