: ఆధారాలతో సహా అవినీతిని నిరూపించేందుకు సిద్ధం: రేవంత్ రెడ్డి


తెలంగాణ గృహనిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిపై టీడీపీ నేత‌ రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. ఈ రోజు హైద‌రాబాద్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ...  స‌ద‌రు మంత్రి ఇళ్ల నిర్మాణాల్లో స‌ర్కారుకి రావాల్సిన ఆదాయాన్ని మింగేశార‌ని ఆరోప‌ణ‌లు గుప్పించారు. 290 ఎకరాల్లో నిర్మించిన ఇళ్లకు గానూ రాష్ట్ర ప్ర‌భుత్వానికి రూ.3 వేల కోట్లు రావాల్సి ఉంద‌ని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఆయా కంపెనీలతో బేరసారాలు జరిపి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి కోట్లు నొక్కేశార‌ని అన్నారు. ఈ అవినీతిపై విచారణకు రావాలన్న మంత్రి సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని చెప్పారు. ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి బ‌హిరంగ చర్చకు వస్తే ఆధారాలతో సహా అవినీతిని నిరూపించేందుకు సిద్ధమ‌ని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి గతంలోనే కమీషన్‌ కోసం పార్టీ ఫిరాయించార‌ని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News