: డొనాల్డ్ ట్రంప్ భారతీయులకు, హిందువులకు అనుకూలమే: తానా అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అమెరికాలో భారతీయుల పరిస్థితిపై తానా అధ్యక్షుడు కోమటి జయరాం స్పందించారు. ఆ దేశంలో కొంత ఆందోళనకర పరిస్థితులు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ, భారతీయులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయనడంలో వాస్తవం లేదని పేర్కొన్నారు. అంతేగాక, అమెరికాలో ఎన్నడూ లేని విధంగా భారత సంతతికి చెందిన నలుగురు ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నతస్థాయిలో ఉన్నారని ఆయన చెప్పారు. కావాలంటే వారితో లాబీయింగ్ చేసుకోవాలని సూచించారు. ఇటీవల హత్యకు గురైన తెలుగు ఇంజినీర్ కూచిబొట్ల శ్రీనివాస్ పట్ల అందరిలో ఆందోళన ఉన్నప్పటికీ, డొనాల్డ్ ట్రంప్ భారతీయులకు, హిందువులకు అనుకూలమనే ప్రచారం కూడా అదేస్థాయిలో జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.