: రాంజాస్ కాలేజ్‌లో మ‌ళ్లీ తీవ్ర‌ ఉద్రిక్త‌త.. భారీగా చేరుకున్న పోలీసులు


ఢిల్లీ యూనివ‌ర్సిటీ ప‌రిధిలోని రాంజాస్ కాలేజ్‌లో ఇటీవ‌లే ఏబీవీపీ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల మధ్య వివాదం చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. దీంతో అక్కడ ఏర్ప‌డిన ఉద్రిక్త ప‌రిస్థితులు ఇంకా కొన‌సాగుతున్నాయి. ఈ రోజు ఏబీవీపీ విద్యార్థుల ఆధ్వ‌ర్యంలో తిరంగా యాత్ర నిర్వ‌హించారు. మ‌రోవైపు ఆ ర్యాలీకి పోటీగా ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆజాదీ ర్యాలీ నిర్వ‌హించింది. దీంతో ఆ ప్రాంతమంతా నినాదాల‌తో మార్మోగిపోయింది. ఈ ప‌రిస్థితుల్లో అక్క‌డికి భారీగా పోలీసు బ‌ల‌గాలు చేరుకున్నాయి. విద్యార్థుల‌ను అదుపుచేసే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. విద్యార్థి సంఘాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. 

  • Loading...

More Telugu News