: నన్ను నమ్మారు... ధన్యవాదాలు: నారా లోకేశ్
తన సామర్థ్యాన్ని నమ్మి, ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించిన తెలుగుదేశం పొలిట్ బ్యూరోకు నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ మీడియా ట్విట్టర్ లో ఈ మేరకు ఓ పోస్టు చేస్తూ, "నన్ను, నా సామర్థ్యాన్ని నమ్మి ఎమ్మెల్సీగా నా పేరును ప్రతిపాదించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ప్రజలకు మరింత దగ్గరగా ఉండి సేవ చేసేందుకు ఎమ్మెల్సీ పదవి ఓ అవకాశం" అని ట్వీట్ చేశారు. కాగా, ఎమ్మెల్యేల కోటా కింద లోకేశ్ కు ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలని నిన్న జరిగిన తెలుగుదేశం సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.