: విరాట్ కోహ్లీ ఎన్నటికీ చేరుకోలేని ధోనీ రికార్డిది!


భారత క్రికెట్ జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టి రాణిస్తున్న విరాట్ కోహ్లీకి ఓ రికార్డు అందకుండా పోయింది. కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును కోహ్లీ తిరగరాసే అవకాశం ఇక లేనే లేదు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే, ధోనీ కెప్టెన్సీలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఆడిన టెస్టు మ్యాచ్ లలో ఏ ఒక్కదాంట్లోనూ భారత్ ఓడిపోలేదు. ఈ రికార్డు మరింతకాలం పాటు పదిలంగా అలాగే నిలిచిపోనుంది. కోహ్లీ తరువాత వచ్చే కెప్టెన్ ఎవరైనా దీన్ని అధిగమించాలే తప్ప, కోహ్లీ పేరిట మాత్రం ఈ రికార్డు ఉండదు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు 333 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.
ఇక ధోనీ కెప్టెన్సీలో భారత గడ్డపై ఆస్ట్రేలియాతో 8 మ్యాచ్ లు జరుగగా, దేనిలోనూ ఇండియా ఓడిపోలేదు. 2008 - 09, 2010 - 11లో జరిగిన సిరీస్ లలో ఇండియా 2-0 తేడాతో విజయం సాధిస్తే, 2012 - 13లో 4-0తో ఇండియా గెలిచింది.

  • Loading...

More Telugu News