: నెల రోజుల బ్యాటరీ సామర్థ్యం, స్నేక్ గేమ్ తో 'నోకియా 3310'


మొబైల్ వర్డ్ కాంగ్రెస్ లో భాగంగా, నోకియా సంస్థ నెలరోజుల బ్యాటరీ సామర్థ్యం, స్నేక్ గేమ్ తో కూడిన ఫీచర్ ఫోన్ 'నోకియా 3310'ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర 49 యూరోలని (సుమారు రూ. 3,500) నోకియా తెలిపింది. ఈ ఫోన్ ఇండియాలో మార్చి తరువాత విడుదలవుతుందని సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఈ ఫోన్ లో 2 ఎంపీ రేర్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ లతో పాటు 2.4 అంగుళాల క్యూవీజీఏ స్క్రీన్, 2జీ కనెక్టివిటీ, 16 ఎంబీ స్టోరేజ్ సదుపాయాలున్నాయి. ఈ ఫోన్ 22 గంటల టాక్ టైమ్ ను అందిస్తుందని నోకియా పేర్కొంది.

  • Loading...

More Telugu News