: ఈ అమ్మాయి మనసును ఎవరు కలుషితం చేస్తున్నారు?: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ మన్ దీప్ సింగ్ కుమార్తె, ఏబీవీపీని వ్యతిరేకించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొత్త చర్చకు తెరలేపిన గుర్ మెహర్ కౌర్ ఉదంతంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ఈ అమ్మాయి మనసును ఎవరు కలుషితం చేస్తున్నారంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. బలమైన సాయుధ దళం ఉంటే యుద్ధాన్ని నివారించవచ్చని, ఇండియా ఎన్నడూ ఎవరిపైనా దాడులు చేయలేదని చెప్పారు. ఇదే సమయంలో ఇండియా బలహీనంగా ఉంటే ఎన్నడైనా ఎవరైనా ముట్టడించే ప్రమాదం ఉంటుందని చెప్పుకొచ్చారు. కాగా, గత సంవత్సరం మేలో, తన తండ్రిని పాకిస్థాన్ చంపలేదని, యుద్ధమే చంపిందని గుర్ మెహర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.