: యూపీలో తమ పార్టీ తప్పు చేసిందన్న కేంద్ర మంత్రి ఉమాభారతి


యూపీ ఎన్నికల్లో భాగంగా టికెట్ల పంపిణీలో తమ పార్టీ కొన్ని తప్పులు చేసిందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఉమాభారతి అంగీకరించారు. ఈ ఎన్నికల్లో ముస్లింలకు టికెట్లు ఇచ్చివుంటే బాగుండేదని అభిప్రాయపడుతూ, ముస్లింలతో పాటు మహిళలకు పెద్ద పీట వేసివుంటే బాగుండేదని అన్నారు. ఈ విషయంలో రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సబబేనని, ముస్లింలకు, మహిళలకు టికెట్లు ఇవ్వకపోవడంపై పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో చర్చిస్తానని అన్నారు. కాగా, నేడు యూపీలో ఐదో దశ ఎన్నికలు జరుగుతుండగా, రాహుల్ గాంధీ స్వీయ నియోజకవర్గం అమేథి, సున్నితమైన అయోధ్య తదితర ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతోంది.

  • Loading...

More Telugu News