: నన్ను ఎలా రేప్ చేయాలనుకుంటున్నాడో చెబుతుంటే భయమేసింది!: ఏబీవీపీని వ్యతిరేకించిన గుర్ మోహన్ కౌర్


బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్)ను వ్యతిరేకించినప్పటి నుంచి తనకు బెదిరింపులు ఎక్కువయ్యాయని, కొందరు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని 1999 కార్గిల్ యుద్ధంలో మరణించిన కెప్టెన్ మన్‌దీప్ సింగ్ కుమార్తె గుర్ మోహన్ కౌర్ తెలిపారు. రాహుల్ అనే వ్యక్తి బెదిరిస్తూ, తనపై ఎలా  అత్యాచారం చేయాలని అనుకుంటున్నాడో సుదీర్ఘమైన వివరణ ఇచ్చాడని, దాన్ని చూసిన తనకు ఎంతో భయం వేసిందని అన్నారు. తనను జాతి వ్యతిరేకిగా చూస్తూ, ఎంతో మంది తిడుతున్నారని, రేప్ చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు.

కాగా, ప్రస్తుతం రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్ ను రాంజాస్ కాలేజీలో ఓ సెమినార్ కు ఆహ్వానించడాన్ని ఏబీవీపీ వ్యతిరేకించగా, దానిపై స్పందించిన గుర్ మోహన్, తన ఫేస్ బుక్ ప్రొఫైల్ చిత్రాన్ని మారుస్తూ, తాను ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థినని, ఏబీవీపీకి భయపడనని, తాను ఒంటరిదాన్ని కాదని, ఇండియాలోని ప్రతి విద్యార్థీ తన వెంటనే ఉన్నాడని రాసిన ప్లకార్డును ప్రదర్శించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు మద్దతిస్తూ ఓ వర్గం, వ్యతిరేకిస్తూ మరో వర్గం సోషల్ మీడియాలో కామెంట్లు గుప్పిస్తున్నారు.

  • Loading...

More Telugu News