: ముందు వారిద్దరినీ పక్కనబెట్టండి: అజారుద్దీన్ సలహా


ఆస్ట్రేలియా చేతిలో తొలి టెస్టులో చిత్తుగా ఓడిపోయి, విమర్శలు కొని తెచ్చుకున్న టీమిండియా, రెండో మ్యాచ్ లోనైనా సత్తా చాటాలంటే తుది జట్టు కూర్పును మార్చాలని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ సలహా ఇచ్చాడు. పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ, ఆల్ రౌండర్ జయంత్ యాదవ్ లను వెంటనే తొలగించాలని, వారి స్థానంలో భువనేశ్వర్ కుమార్, కరుణ్ నాయర్ లను ఆడిస్తే బాగుంటుందని చెప్పాడు. భారత జట్టు సిరీస్ ను కోల్పోతుందని తాను అనుకోవడం లేదని, గెలిచే అవకాశాలు ఉన్నాయని చెబుతూనే, జట్టులో మార్పులు చేస్తే మేలు కలుగుతుందని, బ్యాటింగ్ బలాన్ని పెంచుకునేలా అదనపు ఆటగాడు ఉండాలని అభిప్రాయపడ్డాడు. కాగా, ఆస్ట్రేలియాతో రెండో టెస్టు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News