: ఆస్కార్ వేదికగా ట్రంప్ కు నిరసన సెగ!


ఆస్కార్ అవార్డుల వేదికగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నిరసన సెగలు తాకాయి. ట్రంప్ ట్రావెల్ బ్యాన్ ను వ్యతిరేకిస్తూ, ఉత్తమ విదేశీ చిత్రంగా అవార్డును గెలుచుకున్న 'ది సేల్స్ మెన్' డైరెక్టర్ ఫర్హది విమర్శలు గుప్పించారు. అవార్డుల వేడుకను బహిష్కరించిన ఆయన, తన చిత్రానికి అవార్డు వచ్చిందని తెలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. డొనాల్డ్ ట్రంప్ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. జాతుల మధ్య చిచ్చు పెట్టడం తగదని, ఆయన వైఖరికి నిరసనగానే ఈ కార్యక్రమానికి రాలేదని స్పష్టం చేశారు. ట్రంప్ తన నిర్ణయాలను వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News