: నిడమర్రు మూర్తి రాజు గెస్ట్ హౌస్ లో పట్టుబడ్డ 8 మంది హైదరాబాద్ యువతులు


పశ్చిమ గోదావరి జిల్లాలో చేపల చెరువులకు యజమానిగా పేరు గడించిన నిడమర్రు మూర్తి రాజు గెస్ట్ హౌస్ పై పోలీసులు దాడి చేయగా 8 మంది హైదరాబాద్ యువతులు పట్టుబడ్డారు. పోలీసులు వెల్లడించిన సమాచారం మేరకు, మూర్తి రాజు గెస్ట్ హౌస్ లో ఆశ్లీల నృత్యాలు జరుగుతున్నాయని అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు దాడి చేయగా, తప్పతాగి అసభ్యకర నృత్యాలు చేస్తున్న 30 మంది యువతీ యువకులు అక్కడ కనిపించారు. వీరందరినీ అరెస్ట్ చేశామని తెలిపారు. వీరిలో హైదరాబాద్ తో పాటు విజయవాడకు చెందిన అమ్మాయిలు ఉన్నారని, అందరినీ నేడు కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. చేపల చెరువుల గెస్ట్ హౌస్ లలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై గత కొంతకాలంగా నిఘా పెట్టామని అన్నారు. వీటి నిర్వాహకులు వీకెండ్ పార్టీలు ఏర్పాటు చేస్తూ, వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తెప్పిస్తున్నారని, ఈ తరహా ఘటనలను అడ్డుకుంటామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News