: సినిమా చాన్స్ కోసం అడ్జస్ట్ అవుతావా? అని అడిగాడు: రెజీనా


ఓ ఆంగ్ల దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, అందాల భామ రెజీనా కసాండ్రా గతంలో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని గురించి చెప్పుకుంది. దాదాపు ఏడు సంవత్సరాల క్రితం తాను ఓ తెలుగు చిత్రంలో నటిస్తున్నప్పుడు, ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి తమిళ సినిమాకు అవకాశం ఇస్తానని చెప్పాడని, అయితే, చాన్స్ కావాలంటే, కొన్ని అడ్జస్ట్ మెంట్స్ చేయాలని అడిగాడని చెప్పింది. ఆ సమయంలో అతడేం మాట్లాడుతున్నాడో అర్థం కాక, ఫోన్ పెట్టేశానని అంది. ఇటువంటి పరిస్థితి చాలా మందికి ఎదురవుతూనే ఉంటుందని, విపత్కర పరిస్థితులు ఎదురైన వేళ, మహిళలకు తమను తాము ఎలా కాపాడుకోవాలో తెలిసుండాలని సలహా ఇచ్చింది.

  • Loading...

More Telugu News