: రాష్ట్రపతి రేసులో సుష్మాస్వరాజ్, జోషి... అద్వానీకి మళ్లీ మొండిచేయి!
ఈ ఏడాది జూలైలో ఖాళీ కానున్న రాష్ట్రపతి పదవి కోసం ఇప్పటి నుంచే ఊహాగానాలు జోరందుకున్నాయి. అధ్యక్ష రేసులో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, బీజేపీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, జార్ఖండ్ గవర్నర్ ద్రౌపదిముర్ము పేర్లు కూడా వినిపిస్తుండగా, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి మళ్లీ మొండిచెయ్యే చూపించనున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.