: ‘ఆస్కార్’ విజేతల్లో కొందరు.... అట్టహాసంగా కార్యక్రమం


లాస్‌ఏంజెలెస్‌లో 89వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం కనులపండువగా జరుగుతోంది. కార్యక్రమానికి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సహా హాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటులు పాల్గొన్నారు. నటీనటులు తమ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. కాగా ఇప్పటి వరకు ప్రకటించిన వివరాల ప్రకారం... ఉత్తమ విదేశీ చిత్రంగా ఇరాన్‌కు చెందిన సేల్స్‌మ్యాన్ చిత్రం అవార్డు దక్కించుకోగా ఉత్తమ సహాయనటిగా ఫెన్సెస్ చిత్రానికి గాను వివోలా ఎంపికయ్యారు.

సౌండ్ మిక్సింగ్‌లో హాక్సారిడ్జ్, సౌండ్ ఎడిటింగ్‌లో అరైవల్ చిత్రానికి గాను బెల్లీమార్ విజేతలుగా నిలిచారు. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌గా ఓజే మేడిన్ అమెరికా(ఎజ్రా ఎడిల్‌మ్యాన్‌, కరోలైన్‌ వాటర్లో), ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా ఫెంటాస్టిక్‌ బీస్ట్స్‌ అండ్‌ వేర్‌ టూ ఫైండ్‌ ధెమ్ చిత్రానికి గాను(కొలెన్‌ ఎట్‌ఉడ్‌, ఉత్తమ మేకప్‌, కేశాలంకరణలో  సూసైడ్‌ స్క్వాడ్‌ చిత్రానికి గాను అల్సాండ్రో బెర్టాల్జీ, జిర్జోయో గెగ్రేరియన్‌, క్రిస్టోఫర్‌ నీల్స‌న్‌‌లు ఎంపికయ్యారు. మూన్‌లైట్‌ చిత్రంలో నటించిన  మహేర్షల అలీకి ఉత్తమ సహాయనటుడి అవార్డు దక్కింది.

  • Loading...

More Telugu News