: ఫేస్‌బుక్ ఫీలింగ్స్ అదిరాయి.. ఏడాదిలో 30 వేల కోట్ల రియాక్షన్లు!


ఏడాది క్రితం వరకు ఫేస్‌బుక్‌లో ఎవరైనా చేసిన పోస్టుకు ప్రతిస్పందనగా అయితే కామెంట్, లేదంటే లైక్ చేసే సదుపాయం మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే గతేడాది 24న.. లవ్, వహా, వావ్, శాడ్, యాంగ్రీ తదితర ఐదు ఫీలింగ్స్‌ సింబళ్లను ఫేస్‌బుక్ అందుబాటులోకి తెచ్చింది. వీటి ద్వారా పోస్ట్‌పై మనకున్న అభిప్రాయాన్ని నిస్సంకోచంగా వెలిబుచ్చే అవకాశం దక్కింది. ఇవి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వీటి ద్వారా ఖాతాదారులు 30 వేల కోట్ల రియాక్షన్లు ఇచ్చారట. వీటిలో అత్యధికంగా లవ్ సింబల్‌కు 1.79 బిలియన్ రియాక్షన్లు వచ్చినట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. తర్వాతి స్థానంలో హవా నిలిచినట్టు పేర్కొంది. ఈ సరికొత్త ప్రయోగం విజయవంతమైందని ఫేస్‌బుక్ ఆనందం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News