: ‘ఆస్కార్’ వేళయింది.. మరికొన్ని గంటల్లో అట్టహాసంగా అవార్డుల ప్రదానం

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆస్కార్’ పండుగ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. లాస్ఏంజెలెస్‌లో జరగనున్న ఈ కార్యక్రమం కోసం హాలీవుడ్ అతిరథ మహారథులంతా ఈపాటికే నగరానికి చేరుకున్నారు. మొత్తం 24 విభాగాల్లో ఆస్కార్ అవార్డులు ప్రదానం చేయనున్నారు. 14 విభాగాల్లో ‘లాలా ల్యాండ్’ నామినేట్ అయింది. ఆ తర్వాత అత్యధికంగా ఎనిమిదేసి విభాగాల్లో ‘అరైవల్’, ‘మూన్‌లైట్’ చిత్రాలకు నామినేషన్లు దాఖలయ్యాయి.

బెస్ట్ పిక్చర్,  సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, ఎడిటింగ్ విభాగాల్లో అరైవల్ నామినేట్ అయింది. ఇదో సైంటిఫిక్ ఫిక్షన్ డ్రామా. ఇక ‘మూన్‌లైట్’లో ఒక నల్లజాతీయుని జీవితాన్ని తెరకెక్కించారు. ఉత్తమచిత్రం, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం, ఎడిటింగ్ విభాగాల్లో ‘మూన్‌లైట్’ ఆస్కార్  సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. డేనిస్ దర్శకత్వంలో వచ్చిన ‘అరైవల్’ ఇప్పటికే భారీ వసూళ్లు సంపాదించింది. హఠాత్తుగా భూమిపైకి వచ్చిన గ్రహాంతరవాసుల గురించే ఈ చిత్రం. అయితే ఈసారి ఆస్కార్ బరిలో  ఒక్క భారతీయ చిత్రమూ నిలవకపోవడంతో సినీ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News