: బళ్లారిలో దారుణం.. భార్య, ముగ్గురు పిల్లలు, వదినను హత్య చేసిన వ్యక్తి
భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెతో పాటు తన ముగ్గురు పిల్లలు, వదినను దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలోని బళ్లారిలో చోటుచేసుకుంది. నిత్యం తాగుతూ భార్యను వేధించే తిప్పయ్య (40) డబ్బులు ఇవ్వాలంటూ ఆమెను చిత్ర హింసలు పెట్టేవాడు. తన భార్యపై అనుమానంతో తన నలుగురు సంతానంలో ముగ్గురు తనకు పుట్టలేదని గొడవపెట్టుకునే వాడు. ఈ క్రమంలోనే భార్య పకీరమ్మతో గొడవ పడ్డ తిప్పయ్య ఆగ్రహంతో ఆమెను చంపేసి, ఆ తర్వాత పదేళ్ళ బాసమ్మ, ఏనిమిదేళ్ళ రాజు, ఆరేళ్ళ పవిత్ర, 30 ఏళ్ళ వదిన గంగమ్మను కూడా హత్య చేశాడు. ఈ సమయంలో ఆయన పెద్ద కూతురు ఇంట్లో లేకపోవడంతో ఆమె తప్పించుకుంది. ఐదుగురినీ హత్య చేసిన తిప్పయ్య అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.