: ఇటువంటి పని చేయవద్దని అమెరికా అధ్యక్షుడిని కోరుతున్నా: ఫ్రాన్స్ అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుపై ప్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే స్పందిస్తూ ఆయనకు పలు సూచనలు చేశారు. ప్రపంచంలో ఉగ్రవాదం ఉందని, దానిపై మనమంతా కలిసికట్టుగా పోరాడాలని ఆయన అన్నారు. మిత్ర దేశంపై చిన్నపాటి ధిక్కార ధోరణిని కూడా చూపించకూడదన్నదే తన అభిప్రాయమని అన్నారు. ఫ్రాన్స్ విషయంలో కూడా అటువంటి పని చేయవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని తాను కోరుతున్నానని వ్యాఖ్యానించారు. ఇటీవల పారిస్ గురించి మాట్లాడుతూ ట్రంప్ చేసిన వ్యాఖ్యల దృష్ట్యా హోలాండే ఇలా స్పందించారు.